బాలీవుడ్ లో ఎన్నో చిత్రాల్లో కమెడియన్ గా నటించి విశేష గుర్తింపు పొందిన నటుడు కపిల్ శర్మ(kapil sarma)అయన వ్యాఖ్యాతగా చాలా ఏళ్ళ నుంచి 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' అనే ప్రోగ్రాం వస్తున్న విషయం తెలిసిందే.ఈ షో ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ వేదికగా ప్రసారమవుతుంది.
కొన్ని రోజుల క్రితం టెలికాస్ట్ అయిన ఒక ఎపిసోడ్ లో 'జనగణమన' గీత సృష్టికర్త విశ్వకవి రవీంధ్రనాద్ ఠాగూర్(Rabindranath Tagore)యొక్క లెగసి ని తక్కువ చేసి చూపించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బోంగో భాషి మహాసభ ఫౌండేషన్ కపిల్ శర్మ షో యాజమాన్యానికి లీగల్ నోటీసులు పంపించింది.సల్మాన్ ఖాన్(salman khan)కి చెందిన ఎస్ కె టివీ(sktv)టీం కి కూడా కపిల్ శర్మ షో తో సంబంధాలున్నాయని, దీంతో వాళ్ళకీ కూడా మహాసభ ఫౌండేషన్ నోటీసులు ఇచ్చిందనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు వీటిపై సల్మాన్ టీం స్పష్టతని ఇచ్చింది.మాకు నోటీసులు పంపించారనే మాటల్లో ఎలాంటి వాస్తవం లేదు.అసలు ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో తోనే మాకు సంబంధంలేదని అధికార ప్రకటన ని జారీ చేసింది.